Header Banner

ఓరి దేవుడా.. రూ.15 వేల జీతగాడికి.. రూ.34 కోట్లు కట్టాలని ఐటీ నోటీసు! మీకు కూడా ఇలా జరగవచ్చు ..

  Wed Apr 02, 2025 15:12        India

నెలకి కేవలం రూ.15 వేలు జీతం తీసుకునే ఓ సాధారణ పారిశుద్ధ్య కార్మికుడికి ఏకంగా రూ.34 కోట్ల పన్ను కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో షాక్ తిన్న ఆ కార్మికుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయి. అందులోని పన్ను బకాయి వివరాలు చూసిన కరణ్ సింగ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "నేను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని. నెలకు రూ.15 వేలు మాత్రమే సంపాదిస్తాను.

 

ఇది కూడా చదవండి: ఆగని నిరసనలు.. హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్త‌త‌.. విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌!

 

నాకు రూ.34 కోట్ల పన్ను నోటీసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఎవరో నా పాన్ కార్డును దుర్వినియోగం చేశారు. దీనిపై విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను" అని కరణ్ సింగ్ పోలీసుల ముందు వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరణ్ సింగ్ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారా? లేదా ఆదాయపు పన్ను శాఖ అధికారుల తప్పిదం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలోనూ వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia